మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలనేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల. ఈ కాంబోలో మూవీ కోసం అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అది ఈ ఏడాది నెరవేరబోతోందని అందరూ సంతోషించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆ ప్రాజక్ట్ పట్టాలెక్కేలా కనిపించడం లేదు. తారక్ జనతా గ్యారేజ్ తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలయింది. ఈ మూవీ తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని ఎన్టీఆర్ అనుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ పట్టాలెక్కించాలని భావించారు.
అయితే త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్న సినిమా ఇంకా మొదలు కాలేదు. దీని తర్వాత ఎన్టీఆర్ ప్రాజక్ట్ గురించి డైరక్టర్ ఆలోచిస్తారు. పవన్ సినిమా ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల .. అది పూర్తికావడానికి డిసెంబర్ పట్టవచ్చు. పవన్ పొలిటికల్ గా బిజీ అవుతుండడం వల్ల వచ్చే ఏడాది వరకు కొనసాగవచ్చు. ఇలా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు పవన్ అడ్డుపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.