పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో చిరంజీవి 152 వ మూవీ

  • December 1, 2016 / 01:53 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా కుటుంబ సభ్యుల బ్యానర్లోనే చిత్రాలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనయుడు రామ్ చరణ్ తేజ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో చిరు తన 150 వ మూవీ చేస్తున్నారు. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత మెగాస్టార్ తన బావ మరిది అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. దీనికి బోయపాటి శ్రీను డైరక్టర్ గా ఖరారు అయ్యారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

దీని తర్వాత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నటించనున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో  అన్నయ్య 152 వ సినిమాను నిర్మించేందుకు పవన్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి డైరక్టర్ ఎవరో తెలుసా? పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రెండురోజుల క్రితం మాటల మాంత్రికుడు మెగాస్టార్ కి స్టోరీ చెప్పడం, అందుకు ఆయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందని సమాచారం. ఈ ముగ్గురి కలయిక వినడానికే అద్భుతంగా ఉంది. ఇక ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా పూర్తి వివరాల కోసం మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus