చిరంజీవి రికార్డును బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్
- February 23, 2017 / 07:34 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు టీజర్ రికార్డులను తిరగరాస్తోంది. అర నిముషం నిడివిగల ఈ వీడియో రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే మూడు మిలియన్ (ముప్పై లక్షలు) వ్యూస్ ని దాటేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న కాటమ రాయుడు టీజర్ ని చూసేందుకు అభిమానులు, నెటిజనులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ చిత్రాలలో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా మెగాస్టార్ చిరంజీవి ఖైధీనంబర్ 150 రికార్డు నెలకొల్పింది. దీనిని 7.41 మిలియన్ల మంది చూసారు. ఆ మార్క్ ని కాటమరాయుడు దాటేశాడు.
7.77 మిలియన్ల వ్యూస్ ని పవన్ చిత్రం టీజర్ సొంతం చేసుకుంది. ట్రైలర్ వచ్చేవరకు ఈ దూకుడు అలాగే ఉంటుంది. దీంతో ఇప్పటిదాక టాలీవుడ్ లో తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డ్ సృష్టించింది. పవర్ స్టార్ తొలి సారి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫిల్మ్ ఉగాది కానుకగా మార్చి 24 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















