అభిమానం హింసకు దారి తీయకూడదు : పవన్

  • August 25, 2016 / 02:14 PM IST

“సినీ హీరోల అభిమానుల మధ్య పోటీతత్వం మంచిదే, అది హింసకు దారి తీయకూడదు” అని జన సేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు సూచించారు. ఆయన గురువారం తిరుపతికి వెళ్లి చనిపోయిన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “సమాజానికి ఉపయోగ పడే వ్యక్తి వినోద్ చనిపోయినందుకు చాలా బాధగా ఉంది. ఒక జనసేన సైనికుడుని కోల్పోయాము.

సమాజానికి మంచి చేయాలనీ తపించే ఇంజినీరింగ్ యువకుడుని చంపిన క్రిమినల్ ని వదల కూడదు” అని రాష్ట్ర పోలీసులను కోరారు. ఈ విషయంలో కర్ణాటక పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. హంతకుడిని పట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విఫలమైతే సి.బి.ఐ కి కేసు అప్పగిస్తామని పవర్ స్టార్ స్పష్టం చేసారు. “హీరోలందరం కలిసే ఉంటాము. కానీ కింది స్థాయిలో అలా జరగడం లేదు. అభిమానం మంచిదే, అది చంపుకునే స్థాయిలో ఉండకూడదు” అని మీడియా ప్రతినిధి అడిగిన  ప్రశ్నకు పవన్ ఇలా సమాధానం ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus