తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి మరణం తెలుగు జాతికే కాక, యావత్ సాహితీ లోకానికి తీరని లోటు అని జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రముఖ రచయిత సి.నా.రె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సినారె మరణ వార్త విని పవన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఓ పత్రిక ప్రకటన ద్వారా సినారే కుటుంబసభ్యులకు తన సానుభూతి తెలిపారు. అంతేకాకుండా నారాయణరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. తెలుగు సినీ పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానాన్ని భర్తీ చేయలేనిదని చెప్పారు.
విశ్వంభర రచన ద్వారా జ్ఞానపీఠ్ అవార్డు అందుకుని తెలుగు భాష కీర్తిని విశ్వ వ్యాప్తం చేశారన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తే సినారె సాహితీ వ్యవసాయం చేసి తెలుగు వారికీ సాహిత్య ఫలాలను అందించారని కొనియాడారు. ఆయన మనమధ్య లేకపోయినా, ఆయన వెదజల్లిన సాహిత్య సౌరభాలు మన మధ్య పరిమళిస్తూనే ఉంటాయని వివరించారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.