‘పవన్’ తీరుతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు!!
- March 21, 2016 / 07:32 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే పవన్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కొందరు అయితే, పవనిజమ్ పేరుతో సమాజ సేవ చేసేవాళ్ళు మరికొందరు. ఇదిలా ఉంటే ఒక్కసారి పవన్ కల్యాణ్ ను కలవాలని, పవన్ కు షేక్ హాండ్ ఇవ్వాలి అని, పవన్ తో ఒక్క ఫోటో దిగాలని ఎంతో మంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి అవకాశం ఫ్యాన్స్ కు వస్తే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదా. కానీ అవకాశం వస్తే సరిపోదు ఆ అవకాశం సద్వినియోగం కావాలి కదా..ఈ స్టోరీ అంతా ఏంటి అంటారా….అయితే ఈ మ్యాటర్ చదవాల్సిందే…
పవన్ కల్యాణ్ ని దేవుడుగా కొలిచే కొందరి అభిమానులకి….పవన్ ను సెట్ లో కలవడానికి పర్మిషన్ దొరికింది. ఇంకేముంది ఒక 20మంది పవన్ ఫ్యాన్స్ సర్దార్ సెట్ కి వెళ్లారు. వెయిట్ చేస్తూ ఉన్నారు…ఇంతలో..ఆయన ఒస్తారు ఒక్కొక్కరూ ఫోటో దిగండి అని ఆర్డర్ పాస్ అయ్యింది. గంట కాదు..రెండు గంటలు..కాదు…గంటల తరబడి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అదే సమయం లో సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కోసం కొన్ని సీన్ లు వర్కౌట్ చేస్తున్నారు. దానికోసం బైక్ మీద కళ్యాణ్ వెళ్ళాల్సి ఉంది. కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వకపోవడంతో చిరాకు వచ్చిన పవన్ కల్యాణ్…సెట్స్ నుంచి వెళ్లిపోయారట. పాపం ఆయన్ని కలవాలని వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. అంత సేపు మండే ఎండలో ఫాన్స్ ని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ విషయంలో వారు హర్ట్ అయ్యి వెళ్ళిపోయారు.















