Bandla Ganesh,Pawan Kalyan: అడ్డంగా దొరికిపోయిన బండ్ల గణేష్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్?

బండ్ల గణేష్ ఆయన ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా లేదా ఏ ఒక్క పోస్ట్ చేసిన ఎన్నో వివాదాలకు కారణమవుతుంది. అయితే ఈయన చేసే పోస్టులు మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియక ఇలాంటి వివాదాలు చెలరేగుతూ ఉంటాయి.తాజాగా లైగర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ తాతలు తండ్రుల గురించి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయంపై బండ్ల గణేష్ మాట్లాడుతూ తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి అని కొందరు హీరోల పేర్లు చెప్పారు.

అయితే ఈ హీరోల పేర్లలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ గురించి ప్రస్తావించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ హీరో పేర్లను బండ్ల గణేష్ ప్రస్తావించలేదు.ఈ విధంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై బండ్ల గణేష్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై పవన్ ఫ్యాన్స్ స్పందిస్తూ బండ్ల గణేష్ ఆలోచనల ప్రకారం వీరిద్దరూ టాలెంటెడ్ యాక్టర్స్ కాదా అని ప్రశ్నిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే బండ్ల గణేష్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్ చెప్పిన విధంగా తన తాత అల్లూరి రామలింగయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకొని సొంత టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ బండ్ల గణేష్ కు కనిపించలేదా అంటూ మండి పడుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బండ్లన్న అదే తప్పు చేశారంటూ వీరిద్దరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

అయితే గత కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా బండ్ల గణేష్ పరోక్షంగా ట్వీట్లు చేయడం గమనార్హం. తన ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో బదులు తన తల్లిదండ్రుల ఫోటోలను పెడుతూ గతంలో ఓ సెన్సేషనల్ పోస్ట్ చేశారు.ఇలా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ దూరం పెట్టడంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ కారణంగా మరోసారి వివాదం చెలరేగుతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus