Pawan Kalyan: సాయి తేజ్ కోసం స్పెషల్ చైన్ గిఫ్ట్ చేసిన పవన్ కళ్యాణ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతం సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు .

అయితే మంగళవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా సినిమాలలోకి రావడానికి తన వదిన ఇచ్చినటువంటి ప్రోత్సాహం అలాగే సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురైనప్పుడు తాను పడిన బాధ గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాయి ధరమ్ తేజ్ కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

సాయి ధరంతేజ్ మెడలో వేసుకోవడం కోసం తనని ఒక చైన్ అడిగారని తెలిపారు. అయితే తాను అడగడంతో తనకోసం ప్రత్యేకంగా నీతా లుల్లా డిజైనర్ తో ప్రత్యేకంగా ఒక చైన్ డిజైన్ చేయించానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేదికపైనే తన అల్లుడికి పండగ చేసుకో అంటూ చైన్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఇలా తన మామయ్య తనకోసం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో సాయి ధరంతేజ్ సైతం ఎంతో సంబరపడ్డారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus