Pawan Kalyan: ఆ బడా నిర్మాతకి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

Advertisement

గత 2,3 రోజులుగా ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఓ బడా నిర్మాతకి ఓ స్టార్ హీరో క్లాస్ పీకాడు అనేది ఆ వార్త సారాంశం. పూర్తి వివరాల్లోకి వెళితే.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ నిర్మాత టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కొంత భాగం షూటింగ్ కూడా జరిపారు. అయితే ఆ స్టార్ హీరో మధ్య మధ్యలో వేరే ప్రాజెక్టులకు కమిట్ అయ్యి వాటి షూటింగ్ లకు వెళ్లి వస్తున్నాడు. తన సినిమా షూటింగ్ ముందుకు జరగకపోవడం..

అలాగే సినిమా నిమిత్తం చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ లు నెల నెల వాచిపోతుండడంతో నిర్మాతకి కాలింది. అందుకే ఆ హీరోకి ఓ మెసేజ్ పెట్టాడు. ‘మిమ్మల్ని నమ్మి రూ.150 కోట్లు బడ్జెట్ పెడుతున్నాను.. కాస్త కనికరించండి’ అంటూ మెసేజ్ పెట్టాడు. దీనికి ఆ స్టార్ హీరోకి మరింతగా కాలింది. అందుకే వెంటనే అతని పి.ఏ తో ఫోన్ చేయించి..కాల్ కనెక్ట్ చేయమని చెప్పాడు.అప్పుడు ఆ బడా నిర్మాతకి బాగా క్లాస్ పీకాడు స్టార్ హీరో. ఏమనంటే.. ‘నువ్వు కథని నమ్మి రూ.150 కోట్లు పెట్టావు. నన్ను నమ్మి కాదు.

కేవలం నన్ను నమ్మి రూ.150 కోట్లు పెట్టాను అని చెప్పడం మానుకో’ అంటూ కసురుకుని.. నిర్మాత చెప్పేది కూడా వినకుండా ఫోన్ పెట్టేసాడట. ఆ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని.. ఆ నిర్మాత ఏ.ఎం.రత్నం అని.. ‘హరి హర వీర మల్లు’ అనే పాన్ ఇండియా మూవీ కోసం ఈ గొడవంతా జరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read