పవర్ స్టార్ పవన్ కల్యాణ్ “జనసేన” పార్టీ అధినేతగా చక్రం తిప్పేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడా?? అంటే అవును అనే అంటున్నాయి అటు సినిమా, ఇటు పొలిటికల్ సర్కిల్స్. ఇంతకీ విషయం ఏమిటంటే…పవన్ కల్యాణ్ ఇప్పుడు సర్దార్ ను మరచిపోతూ, ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక అదే క్రమంలో 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక అదే క్రమంలో దాసరి పవన్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి…ఇదే విషయమై….తాజాగా టాలీవుడ్ లో కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి…మరి ఆ కధా కమామి పై ఒక లుక్ వేద్దాం రండి…టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్స్ ప్రకారం…దాసరి నారాయణరావు నిర్మాణంలో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ కి స్టొరీ లైన్ సెట్ అయింది అని టాక్ . పవన్ ఆలోచనలతో త్రివిక్రమ్ పదునైన మాటలు, డైరెక్షన్‌తో నిర్మింప బడే ఈ సినిమా త్రివిక్రమ్ ఇప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా రాజకీయ నేపధ్యంలోఈ సినిమాను తీయబోతున్నారు అని టాక్.
రాజకీయాల మీద పట్టున్న పవన్ దాసరిల సూచనలతో త్రివిక్రమ్ ఈ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాయడానికి అంగీకరించాడు అని టాక్. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకిని వచ్చేఏడాది మొదట్లో ప్రారంభం అయ్యే ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరకు విడుదల చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎన్నో టైటిల్స్ అనుకుంటూ ఉన్నా ఒకప్పుడు పవన్ సినిమాల కోసం ప్రచారంలోకి వచ్చిన ‘సత్యాగ్రహి’ టైటిల్ అయినా ఆశ్చర్యం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పవర్ ఫూల్ కాంబినేషన్ ఎంతవరకూ వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.