ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం పవన్ కి ఎందుకు ఇష్టం లేదు?

  • January 7, 2017 / 07:51 AM IST

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా చేసిన చిత్రం ఖైదీ నంబర్ 150  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు  మంగళగిరిలోని హాయ్ ల్యాండ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షమంది మెగా అభిమానులు తరలి రానున్నారు. మెగాస్టార్ కుటుంబానికి చెందిన హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు మెగాస్టార్ కి ఘనంగా చిత్ర పరిశ్రమలోకి పునః స్వాగతం చెప్పాలని భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఈ వేడుకకు రప్పించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రయత్నిస్తున్నారు. పవన్ ఈ ఫంక్షన్ కి వస్తారా? లేదా ? అని అందరూ ఎదురుచూస్తుంటే ఆయన లెక్క వేరేగా ఉంది.

అన్నయ్య చిత్రానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనవసరమని కొట్టిపడేశారు. ఎంత ఆలస్యంగా వస్తున్నప్పటికీ చిరంజీవిపై క్రేజ్ తగ్గదని, అలాంటప్పుడు ఈ వేడుక వద్దని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని సమాచారం. అందుకే ఈ వేడుకకు రావడానికి ఆయన ఆసక్తిగా లేరని తెలిసింది. అయినా అన్నయ్య, వదిన, అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి వస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus