పవన్‌కళ్యాణ్‌కు సంబంధించిన చిన్న వార్త , ఒక ఫొటో , ఓ లుక్ , ఓ ప్రొమో, ఓ ట్వీట్ అయినా సరే అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పవన్‌కు సరైన స్పందన రాకపోతే దానికి కారణం ఏమై ఉంటుందా? అనేది అందరూ తలలు బద్దలుకొట్టుకునే అంశం. ఆమధ్య ‘జనసేన’ పార్టీపై పవన్ పుస్తకం ఒకటి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకానికి విపరీతమైన క్రేజ్ ఉంటుందనే ఆశతో ఆ బుక్‌ను చాలా ఎక్కువ సంఖ్యలో ముద్రించి విడుదల చేశారు. కానీ ఈ పుస్తకం పవన్ అభిమానులను పెద్దగా ఆకర్షించలేకపోయింది.
ప్రింట్ చేసిన కాపీలలో సగం అమ్ముడుపోక ప్రింటర్‌కు చాలా నష్టాలు వచ్చాయని సమాచారం. తాజాగా పవన్‌కళ్యాణ్ బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అందరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోతోందని సమాచారం. ఈ ఇంటర్వ్యూ శనివారం విడుదలైంది. ఈ ఇంటర్వ్యూలో మొదటి పార్ట్‌ను ఇప్పటివరకు 2లక్షల 50వేల మంది చూశారు. రెండోపార్ట్‌ను 1లక్షా 25వేల మంది వీక్షించారు. మూడో పార్ట్‌ను కేవలం 1లక్ష మాత్రమే చూశారు. ఇది పవన్‌కు ఉన్న ఇమేజ్, క్రేజ్‌లతో పోల్చుకుంటే చాలా తక్కువని, మరీ దీనికి కారణం ఏమిటా? అని ఫిల్మ్ క్రిటిక్స్ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.