పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అప్పట్లో విడుదలయ్యి సంచలనాలు సృష్టించిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఎంత భారీ హిట్ అయ్యిందో, ఈ సినిమా అంత డిజాస్టర్ గా టాలీవుడ్ హిస్టరీ లో మిగిలిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫలితంతో నిరుత్సాహంలో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కూల్ చేసేందుకు పవన్ వెంటనే ఖుషీ దర్శకుడితో ఒక సినిమా మొదలు పెట్టేశాడు. అయితే తాజాగా వినిపిస్తున్న వాదన ప్రకారం, పవన్ కు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ ఒకటి వచ్చింది అని తెలుస్తుంది. ఇంతకీ ఏంటి ఆ ఆఫర్ అంటే…సోషియల్ మెసేజ్ కి సంబంధించిన ఓ మూవీలో పవన్ ను తీసుకోవాలని బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్..పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా వచ్చారని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా వివరాలు కూడా ఇలా ఉన్నాయి…సౌతిండియాకి సంబంధించిన పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ సాగనుందని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఉన్న కథానాయకుడుగా పవన కళ్యాణ్ అని తెలుసుకున్నాడంట. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్, తన నిజాయితీ ఈ మూవీకి బాగా ఉపయోగపడుతుందని తను భావించాడు. అందుకే బాలీవుడ్ కి చెందిన ఆ డైరెక్టర్ పవన్ తో ఇప్పటికే చర్ఛలు జరిపారని తెలుస్తుంది. అసలే పవన్ సినిమాలు మానేస్తాను అంటున్నాడు, ఇలాంటి క్రమంలో ఇలాంటి ఆఫర్ రావడం మంచి శుభ పరిణామం మరి.