భారీ అంచనాల మీద వస్తున్న ‘సర్దార్’ సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 100 కోట్ల వరకు జరిగింది. నిర్మాతలు ఈ సినిమా థియేటర్ రైట్స్ ను సుమారుగా 72 కోట్లకు అమ్మారు. థియేటర్ రైట్స్ మీదే ఇంత వచ్చేస్తే.. మిగిలిన వాటి లెక్కలు భారీగా ఉండే అవకాశం ఉంది. సర్దార్ నిర్మాతలకుఇప్పటికే టేబుల్ ప్రాపిట్ వచ్చిందని తెలుస్తోంది. మరి పవన్ రెమ్యునరేషన్ ఎంతన్న దానిపై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ సుమారుగా 33 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇప్పటివరకూ మరే హీరో తీసుకోలేదని చెబుతున్నారు.