నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలను బాలయ్యతో పంచుకున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. పవన్ తో మాట్లాడుతూ.. ‘అసలు ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా’ అని బాలకృష్ణ అడిగారు. దానికి పవన్.. తను అసలు పెళ్లి చేసుకోవాలనుకోలేదని, బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకున్నానని అన్నారు.
కానీ ఇప్పుడు చూస్తే నాకే ఇలా జరిగిందా..? అని అనిపిస్తుందని.. నేను చాలా సంప్రదాయంగా బతికే వ్యక్తిని అని చెప్పారు. మొదటి సంబంధం ఇంట్లో వాళ్లు చూసి చేశారని.. ఆ బంధంలో కొన్ని కుదరలేదు కాబట్టి విడిపోయామని అన్నారు. రెండోసారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే.. ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదురా బాబు అని చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఒక వ్యక్తితో కుదరకపోవడంతో.. మరొకరిని చేసుకున్నానని..
వాళ్లతో కూడా కుదరకపోవడంతో.. ఇంకోసారి చేసుకున్నానని అన్నారు. కోరికతోనో, వ్యామోహంతోనో.. మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని.. అలా జరిగాయి అంతే అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయిందని అన్నారు. కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తన లైఫ్ లో చాలా మంది అధికారులను చూశానని.. తనను విమర్శించే నాయకుల వ్యక్తిగత జీవితాలు తనకంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. కానీ సంస్కారం అడ్డొచ్చి అలాంటి విషయాలను మాట్లాడనివ్వదని అన్నారు.
ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే.. తనకు ఇంట్లో ఆడపడుచులు గుర్తొస్తారని.. అవతలి వాళ్లకు ఆ సంస్కారం లేదు కాబట్టే పదేపదే అలాంటి విషయాల గురించి మాట్లాడతారని అన్నారు. పవన్ చెప్పిందంతా విన్న బాలయ్య.. ‘ఇంకోసారి ఆయన(పవన్ కళ్యాణ్) గురించి, పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?