నిర్మాత బండ్ల గణేష్ కు దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

  • August 26, 2020 / 07:47 PM IST

కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాడు బండ్ల గణేష్. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్ అవ్వడంతో నిర్మాతగా కూడా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసాడు.అయితే కొన్నాళ్ళ తరువాత మళ్ళీ నిర్మాణ రంగం వైపుకి ఈయన చూడలేదు. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ సినిమాల్లో కంటే ఎక్కువ కామెడీ చేసి నవ్వుల పాలయ్యాడు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేకపోయాడు. ఈ లాక్ డౌన్ లో కరోనా ను కూడా ఓసారి పలకరించి వచ్చాడు మన బండ్లన్న.

ఈయన ఏమి మాట్లాడినా చాలా ఫన్నీ గా ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవల ఈయన ‘అలీతో సరదాగా’ షో కి గెస్ట్ గా వచ్చాడు.దానికి సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేసారు. ఆ షోలో ‘గబ్బర్ సింగ్’ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు బండ్ల గణేష్.’ ‘గబ్బర్ సింగ్’ ప్రీ ప్రొడక్షన్ టైములో హీరోయిన్ గా శృతీ హాసన్ వద్దని’ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ అన్నాడట.’ఎందుకు?’ అని పవన్ అడిగితే…’ఆ అమ్మాయికి అన్నీ ప్లాప్ లే బాబు’ అన్నాడట.

దానికి పవన్ ‘నువ్వేదో అన్నీ హిట్లే తీసినట్టు చెప్తున్నావేంట్రా..? పొ పోయి ఆ అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చెయ్యి’ అంటూ నిర్మాత బండ్ల గణేష్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus