ఇక సినిమాలకు సెలవు…పవన్??

  • May 24, 2016 / 12:27 PM IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ పవన్ కొత్త సినిమాపై ఆశలు పెంచుకుంటున్నారు పవన్ అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్, తమిళ దర్శకుడు సూర్యతో కలసి చేస్తున్న సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఖుషీ సినిమా సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా నేను ఎన్నో సినిమాలు చెయ్యను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అంటూ పవన్ జనసేన వేదికగా పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ మాటతో పవన్ ఇంకా ఎన్ని సినిమాల్లో నటిస్తాడు అన్న డౌట్ అందరిలో నెలకొంది. ఇక ఇదే విషయంపై ఇండస్ట్రీ లో క్లియర్ టాక్స్ సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం, పవన్ సన్నిహితుల నుంచి వస్తున్న విషయం ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించనున్న సూర్య మూవీ కాకుండా మరో చిత్రంలో నటించనున్నాడని అంటున్నారు. ఆ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుందని అంటున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తాడు అన్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఇప్పటికీ అన్నతో కలసి చేసిన తొలి ప్రయత్నం ఫేయిల్ కాగా, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు పవన్. ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus