సినిమాలో రాజకీయాలు వద్దు – పవర్ స్టార్!!!

  • October 20, 2016 / 09:28 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ రేంజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇప్పుడు పవన్ సినిమా హీరో మాత్రమే కాదు….పాలిటిక్స్ లోను మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు….గత ఎన్నికల్లో ఇప్పటి అధికార పక్షాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నం చేసిన పవన్ ఆతరువాత తన జనసేన తో ప్రజల్లోకి వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే….ప్రస్తుతం “కాటమ రాయుడు” సినిమాలో నటిస్తున్న పవన్ ఆతరువాత వెంటనే మరో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు…ఆ తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలి అన్న ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు షూటింగ్ లో పాల్గొనగా…కొంత మంది ఆర్టిస్ట్ లు పవన్ కళ్యాణ్ తో రాజకీయాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. కొంత వరకూ బాగానే మాట్లాడిన పవన్ కళ్యాణ్…తరువాత ఆ టాపిక్ ని వారితో మాట్లాడేందుకు ఏమంత ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇక ఇదే పద్దతి ప్రతీ రోజు కంటిన్యూ అవుతూ వస్తూ ఉండడంతో తనతో పొలిటికల్ టాపిక్స్ ఎవ్వరూ మాట్లాడకుడదని స్ట్రిక్ట్ గా చెప్పుకొచ్చాడంట. దీంతో కాటమరాయుడు షూటింగ్ లో పాల్గొనే ఆర్టిస్ట్ లు పవన్ కళ్యాణ్ తో పొలిటిక్స్ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. మరి పవన్ ఎందుకు అలా అన్నాడో తెలీదు కానీ…మొత్తానికి సినిమాలో రాజకీయాలు వద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus