ఫ్యాన్స్ ను కలవడానికి వెళ్తోన్న పవన్ !

  • June 28, 2016 / 01:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. విదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు ఏదొక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అతిథిగా విచ్చేస్తూనే ఉన్నారు. కానీ ఏనాడు పవన్ విదేశాల కార్యక్రమాలకు వెళ్లిన దాఖలు లేవు. కానీ ఈసారి తన నిర్ణయాన్ని మార్చుకొని అభిమానులతో సమయం కేటాయించాలని ఫిక్స్ అయ్యాడట.

యుక్తా వారి ఆధ్వర్యంలో జరగనున్న జయతే కూచిపూడి కార్యక్రమానికి వచ్చే నెల 9 వ తేదీన పవన్ వెళ్లనున్నట్లు సమాచారం. పవన్ తదుపరి చిత్రం మొదలు కావడానికి కాస్త సమయం ఉండడంతో ఆ సమయాన్ని తన అభిమానులతో గడపాలని పవన్ ప్లాన్ చేసుకున్నాడు. లండన్, యూరోప్ దేశాల్లో గల అభిమానులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ పాల్గొనున్నట్లు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus