పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేసిన మెగాస్టార్

  • November 4, 2016 / 11:23 AM IST

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఉహించని విధంగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ కి షాక్ ఇచ్చారు. రెండు నెలలుగా చిరంజీవి తన ఖైదీ నంబర్ 150 మూవీ షూటింగ్ లో బిజీ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెల నుంచి విరామం లేకుండా కాటమ రాయుడు షూటింగ్లో నిమగ్నమయ్యారు. రామానాయుడు స్టూడియోలో వేసిన విలేజ్ సెట్ లో రోజూ మాదిరిగానే యాక్షన్ కి సిద్దమయిన పవన్ వద్దకు గురువారం మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.

అనుకోకుండా వచ్చిన అన్నయ్యను చూసి పవన్ సంతోషపడ్డారు. కొంతసేపు షూటింగ్ కి విరామం ఇచ్చి అన్నదమ్ములిద్దరూ మాటల్లో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల యోగ క్షేమాలతో పాటు, ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఖైదీ నంబర్ 150 లో రైతులు చిరుకి గోడును వినిపించుకునే సీన్ ఒకటి ఉంది. ఈ సన్నివేశాన్ని కాటమ రాయుడు సెట్లోనే తీయాలని చిరు భావించారు. అందుకోసం ఈ సెట్ కి మెగాస్టార్ వచ్చారని, రెండు రోజులపాటు ఇక్కడ ఖైదీ షూటింగ్ జరుగుతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus