పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కాకుండా, పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ఎక్కువగా ఆయన జనాల్లోనే తిరుగుతూ ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో ఆయన సినిమాలు చేయాలంటే.. కొంచెం కష్టమే. కానీ గతంలో స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్లను ఆదుకోవాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఈ క్రమంలో ‘ఓజీ'(OG Movie) , హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ..సినిమాల షూటింగ్లు ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో ‘ఓజీ’ ని ముందుగా పవన్ ఫినిష్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ పవన్ మాత్రం ‘హరిహర వీరమల్లు’ కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 23 నుండి ‘వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. కొన్ని కీలక యాక్షన్ సీన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని ప్లాన్ చేశారు. దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు.
వాస్తవానికి ‘హరిహర వీరమల్లు’ పై అభిమానుల్లో పెద్దగా ఆసక్తి లేదు. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) చేసిన గత సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకోవచ్చు. అయినప్పటికీ ఇది కోవిడ్ కి ముందు మొదలుపెట్టిన సినిమా. నిర్మాత ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) వడ్డీల రూపంలో భారీ మొత్తం చెల్లిస్తున్నారు.అతనిపై మరింత భారం పెట్టడం పవన్ కి ఇష్టం లేదు. అందుకే ముందుగా పవన్ ‘హరిహర వీరమల్లు’ కి డేట్స్ ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది.