Tripti Dimri: కెరీర్ తొలినాళ్లలో అలాంటి సవాళ్లు.. త్రిప్తి డిమ్రి చెప్పిన విషయాలివే!

యానిమల్ (Animal) సినిమాతో త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ఓవర్ నైట్ లో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు పెరుగుతున్నాయి. త్రిప్తి డిమ్రి కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పారు. నటిగా మారాలనుకున్న సమయంలో కుటుంబ సభ్యులు ప్రోత్సహించినా చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఇష్టానుసారం మాటలతో భయపెట్టారని చెప్పుకొచ్చారు. మాది ఉత్తరాఖాండ్ అని కొన్ని కారణాల వల్ల మా ఫ్యామిలీ ఢిల్లీలో సెటిల్ అయిందని ఆమె తెలిపారు.

Tripti Dimri

నేను ఢిల్లీలోనే పుట్టి పెరిగానని ఆమె పేర్కొన్నారు. తాను ధైర్యం చేసి ముంబైకి వచ్చానని ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని త్రిప్తి డిమ్రి వెల్లడించారు. ఒకే గదిలో సుమారు 50 మంది ఉండేవాళ్లమని ఆమె పేర్కొన్నారు. ప్రతిరోజూ నేను వర్క్ కోసం ప్రయత్నాలు చేసేదాన్నని ఆమె తెలిపారు. చేతిలో ఆఫర్లు లేక బాధ పడిన క్షణాలు సైతం ఉన్నాయని త్రిప్తి డిమ్రి పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో నమ్మకం సైతం కోల్పోయానని ఆమె అన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నానని త్రిప్తి డిమ్రి అన్నారు. తల్లీదండ్రుల వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. లైలా మజ్ను సినిమాతో నాకు మంచి పేరు వచ్చిందని ఆమె అన్నారు. నేను ముంబైకి వచ్చిన సమయంలో సినిమా ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ కాదని తనను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారని చెప్పారని తృప్తీ డిమ్రి పేర్కొన్నారు.

మొదట నా కుటుంబ సభ్యులు భయపడ్డారని లైలా మజ్ను సినిమా రిలీజైన తర్వాత ఎంతో ఆనందపడ్డారని త్రిప్తి డిమ్రి తెలిపారు. ప్రేక్షకులు నా యాక్టింగ్ తో కనెక్ట్ అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. త్రిప్తి డిమ్రి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ కొరటాల శివ చురకలు.. చిరుకేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus