పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల రీత్యా సినిమాలని పక్కన పెట్టారు. తన పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన 6 నెలల పాటు నాన్ స్టాప్ గా కష్టపడి జనాల్లో తిరిగారు. అందుకు తగ్గ ఫలితం కూడా దక్కింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. మరి ఆయన పెండింగ్లో ఉంచిన సినిమాల సంగతేంటి? ‘నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా?’ అంటూ ఆయన మొన్నామధ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
అయితే ‘ ‘ఓజీ’ (OG Movie) చూద్దురుగాని బాగుంటుంది’ అంటూ ఆయన అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం కూడా జరిగింది. సో ‘ఓజీ’ సినిమా అయితే కచ్చితంగా చూడొచ్చు అని ఫ్యాన్స్ ఆశలు పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగిందట. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్.. అక్టోబర్ నుండి షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని పవన్ చెప్పారట. అయితే అక్టోబర్లో షూటింగ్ అంటే.. పవన్ నెల రోజుల పాటు లుక్ మార్చుకునే పనిలో పెడతారట.
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల.. టైంకి తిండి, నిద్ర లేక ఆయన ఫిజిక్ లో కూడా మార్పులు వచ్చాయి. అందువల్ల ‘ఓజీ’ కోసం పవన్ కసరత్తులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయట. రీ ఎంట్రీ తర్వాత పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. పైగా గ్లింప్స్ కూడా అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.