పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో అత్తారింటికి దారేది చిత్రం ఓ మైలు రాయిగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకొని కోట్లు కురిపించింది. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్, ఈ చిత్రాన్ని ఫిబ్రవరికి పూర్తిచేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తమిళ దర్శకుడు అనిరుధ్ ఇప్పటికే మూడు పాటలను కూడా అందించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.
ఇందులో పవన్ ని కొత్తగా చూపించాలని డైరక్టర్ భావిస్తున్నారట. అందుకే కొన్ని కిలోల బరువు తగ్గాలని చెప్పారంట. ఇందువల్ల కాటమరాయుడు తర్వాత నేరుగా తర్వాతి చిత్రం షూటింగ్ లో పాల్గొనలేరు. కొన్ని రోజులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. పవర్ స్టార్ తొలిసారి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తికావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. ఫిబ్రవరి 15 నాటికి కాటమరాయుడు కంప్లీట్ అయినప్పటికీ ఫిట్ నెస్ కోసం పవన్ కనీసం 20 రోజులు కేటాయించాలి. సో పవన్, త్రివిక్రమ్ మూవీ మార్చిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.