గోవుల మధ్య గోపాలుడు..!!

  • July 11, 2016 / 10:13 AM IST

కొత్త సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గెట‌ప్ ఏంటి? గ‌త కొద్దిరోజులుగా టాలీవుడ్‌లో ఇదే ప్ర‌శ్న‌. కొంద‌రేమో తెల్ల‌టి గెడ్డంతో క‌నిపిస్తాడ‌నే వార్త‌లొచ్చాయి. అయితే అదేం లేదు ఎప్ప‌టిలానే క్లీన్ షేవ్‌లో అని అన్నారు. కొంద‌రేమో సినిమా మొత్తం పంచెతోనే ఉంటాని అన్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితే అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌డు ఎలా ఉన్నాడు.

గెడ్డంతోనా లేక షేవ్‌తోనా… ఈ ప్ర‌శ్నకు ఈ స‌మాధానం ఈ ఫొటో. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా ఫొటో. ప‌వ‌న్ త‌న ఫామ్‌హౌస్‌లో ఉండ‌గా ఈ ఫొటోను అత‌ని స్నేహితుడు, నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఈ ఫొటో షేర్ చేశారు. ఇదంతా తేలింది కానీ డాలి ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే సినిమాలో ప‌వ‌న్ గెట‌ప్ ఎలా ఉంటుందో ఇంకా తేల‌లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus