Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » హరిద్వార్‌లో పవర్ స్టార్, దేశంలోని నదులను కాపాడుకోవాలి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

హరిద్వార్‌లో పవర్ స్టార్, దేశంలోని నదులను కాపాడుకోవాలి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

  • October 11, 2019 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హరిద్వార్‌లో పవర్ స్టార్, దేశంలోని నదులను కాపాడుకోవాలి.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం సాయంత్రం హరిద్వారకు చేరుకున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మొగసే అవార్డు గ్రహీత శ్రీ రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. పిలిచిన వెంటనే కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం వెన్నునొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హరిద్వార్ వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు డెహ్రడూన్ చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా హరిద్వార్ లోని శివారు ప్రాంతంలో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారు.

pawan-kalyan-visits-matrisadan-asram-in-haridwar1

ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని శ్రీ జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపారు. ఆశ్రమ గురూజీ శ్రీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్ లు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంప్రదాయ సిద్ధమైన తలపాగను శ్రీ రాజేంద్రసింగ్ కట్టారు. గంగా నదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏ విధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్న పానీయాలు మాని 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దానిని భర్తీ చేయాలని కోరారు.

pawan-kalyan-visits-matrisadan-asram-in-haridwar2

శ్రీ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. జి.డి. అగర్వాల్ లో ఉన్న పోరాట స్ఫూర్తిని తాను శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో చూశానని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సెకను కూడా ఆలోచించ కుండా తాను తప్పక వస్తానని చెప్పి, ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నారని అన్నారు. గంగా ప్రక్షాళణ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టి కృషి చేయాలని ఆయన కోరారు.

pawan-kalyan-visits-matrisadan-asram-in-haridwar3

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. తాను పోరాటయాత్రలో ఉండగా జి.డి అగర్వాల్ మరణ వార్త తెలిసిందని ఒక మహత్తర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలచివేసిందన్నారు. ఆ రోజునే తాను హరిద్వార్ వచ్చి జి.డి. అగర్వాల్ కి నివాళులు అర్పిద్దామనుకున్నానని, అయితే పోరాట యాత్రలో ఉన్నందువల్ల రాలేకపోయానని చెప్పారు.

pawan-kalyan-visits-matrisadan-asram-in-haridwar4

ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన పట్ల నాకున్న భక్తి శ్రద్దలను వ్యక్తం చేయడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగనే కాదని, భారత దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు. గంగా ప్రక్షాళణ పోరాటం దీనికి నాంది కావాలని అన్నారు. తొలుత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వామి నిగమానంద సరస్వతి సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం ఆశ్రమం పక్కనే ప్రవహిస్తున్న గంగా నది వద్ద జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు, రేపు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హరిద్వార్ లోని పవన్ ధామ్ ఆశ్రమంలో విడిది చేస్తున్నారు. ఆయనతోపాటు శ్రీ రాజేంద్రసింగ్ కూడా అక్కడే బస చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JanaSena Chief Pawan Kalyan
  • #pawan
  • #PawanKalyan
  • #Powerstar

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

12 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

14 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

15 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

13 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

14 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

15 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

16 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version