Pawan Kalyan Watch: పవన్ వాచ్ ఖరీదుతో లగ్జరీ ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా?

  • October 3, 2022 / 12:12 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలోను మరో వైపు సినిమాలలోను ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ప్రస్తుతం ఈయన రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తాను కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరుమలు సినిమా వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలుపు రంగు దుస్తులలో కనిపిస్తూ ఉన్నారు. కానీ హరిహర వీరు మల్లు సినిమా వర్క్ షాప్ కోసం ఈయన క్యాజువల్ వేర్ లో రావడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే ఈయన రెడ్ కలర్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించి ఈ వర్క్ షాప్ లో పాల్గొనడంతో పవన్ కళ్యాణ్ కు ఈ లుక్ ఎంత అద్భుతంగా ఉందని ఈ లుక్ లో పవను చూసిన అభిమానులు ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇలా రెడ్ కలర్ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించిన అభిమానులు ఆయన వేసుకున్న షూస్ ధరతో పాటు ఆయన చేతికి ఉన్న వాచ్ ధర కూడా ఎంత అని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేతికి ఉన్న వాచ్ ఖరీదు తెలిస్తే అత్తారింటికి దారేది సినిమాలో సమంత చెప్పిన ఓ డైలాగ్ నిజమేనని అనిపిస్తుంది ఆయన చేతికున్న వాచ్ అమ్మితే మీ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది అంటూ సమంత చెప్పిన డైలాగ్ పవన్ కళ్యాణ్ విషయంలో నిజమేనని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47mm, ఈ వాచ్ ధర అక్షరాల… రూ. 14.7 లక్షల రూపాయలని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఈయన చేతికి కట్టుకున్న వాచ్ డబ్బులతో ఓ సామాన్యుడు ఎంతో లగ్జరీ ఇంటిని కూడా నిర్మించుకోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus