మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి తాత్కాలికంగా నిష్క్రమించిన తర్వాత టాలీవుడ్ నెం.1 హీరో పొజిషన్ కి మహేష్ బాబుతో తలపడి కాస్త గట్టి పోటీ ఇవ్వడమే కాక.. ఆ స్థానాన్ని దాదాపుగా కైవసం చేసుకొన్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. ఆయన సినిమాల హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సాధించుకున్న అభిమాన గణమే అందుకు కారణం. సదరు అభిమాన గణాన్ని చూసిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో నిల్చోంటున్నప్పుడు.. ఈజీగా గెలిచేస్తాడులే అనుకొన్నారు. కానీ.. నిలబడిన రెండు చోట్లా ఓడిపోవడంతో.. గేలి చేశారు.
నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని “బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్”ను క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. 24 గంటల్లో ఏకంగా 1.05 కోటి ట్వీట్స్ తో ఇండియాలో బిగ్గెస్ట్ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేశారు. ఇక్కడవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఈ కోటి మందిలో సగం మంది ఆయనకి ఓటేసినా పవన్ కళ్యాణ్ గెలిచి ఉండేవాడు అని జోకులు మొదలయ్యాయి. యాంటీ ఫ్యాన్స్ జోక్ చేసినా.. అది కూడా నిజమే కదా అనిపించింది. మరి వచ్చే ఎన్నికల్లోనైనా పవన్ కళ్యాణ్ ఈ అభిమాన గణాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోగలడో లేదో చూడాలి.