పవన్ ఫ్యాక్షన్ స్టోరీ లీక్ అయ్యింది??

  • August 10, 2016 / 07:31 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమాపై పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఆ మధ్య పవన్ నటించిన అత్తారింటికి దారెది సినిమా విడుదలకు ముందే విడుదలవగా ఇప్పుడు పవన్ తాజాగా నటిస్తున్న చిత్రం స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2016లో పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఎంతటి డిజాస్టర్ అయ్యిందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అయితే ఆ సినిమాను మరచిపోయేలా చేసేందుకు పవన్ వెంటనే ఖుషీ సినిమా దర్శకుడితో ఒక సినిమా మొదలు పెట్టేశాడు.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకుని, ఆ స్థానంలో గోపాల గోపాల దర్శకుడు డాలీని ఉంచాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమాకు సంభందించిన స్టోరీ టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది, ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, లీక్ అయిన స్టోరీ మాత్రం ఇదే….కడపలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కొనసాగుతుండగా ఆయనకు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది..వారి మద్య ప్రేమ చిగురిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమకథ విఫలమవుతుందట. దీంతో మన హీరో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతాడట.

ఒకానొక సందర్భంలో మరో అమ్మాయి పరిచయం కావడం  ప్రేమ, పెళ్లి పట్ల పవన్ కి మనసు మారేలా చేస్తుంది. అంతే కాదు ఆ బ్రహ్మచారిని తన ప్రేమలో పడేలా చేసుకుంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ లవ్ స్టోరీ గుడ్ ఫీల్ కలిగిస్తుందని అంటున్నారు. కధ వినడానికి పాతదే అయినా….టేకింగ్ మీదనే పూర్తిగా డిపెండ్ అయ్యీ ఉంటుంది. చూడాలి ఇది ఎంతవరకూ నిజమో….

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus