‘ఆర్.ఎక్స్.100’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో పాయల్.. రెచ్చిపోయి మరీ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. గ్లామర్ షో విషయంలో అయితే దుమ్ము దులిపేసింది అనే చెప్పాలి. ఇక నటనకు కూడా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో .. ఈమెకు వరుస అవకాశాలు రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే వెంకటేష్ ‘వెంకీ మామ’, రవితేజ ‘డిస్కో రాజా’ వంటి క్రేజీ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.
అయితే స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. పాయల్ ఇప్పుడు గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అనే చెబుతుంది. కానీ లిప్ లాక్ ల విషయంలో మాత్రం ఆమె ఒప్పుకోవడం లేదట. వాటికి ఒప్పుకోవాలి అంటే.. దర్శకనిర్మాతలు ఆమె తల్లి పర్మిషన్ తీసుకోవాలని చెబుతుందట. ‘తనకి ఏది కరెక్ట్ అనేది ఆమె తల్లే డిసైడ్ చేస్తుందట.
తనకు సపోర్ట్ ఇచ్చేది కూడా ఆమెనే. ఒకవేళ తను తప్పు చేస్తే.. తన తల్లే కరెక్ట్ చేస్తుంది. ఇక నుండీ ఆ లిప్ లాక్ ల విషయంలో నా తల్లి చెప్పినట్టే వినాలని డిసైడ్ అయ్యాను’ అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.