వెంకీ మామ విజయం పాయల్ కెరీర్ కి చాలా కీలకం!

“ఆర్ ఎక్స్ 100” సాధించిన విజయంలో హీరో కార్తికేయ నటన, కండలు మరియు దర్శకుడి ప్రతిభ పోషించిన పాత్ర కంటే ఇందు పాత్రలో పాయల్ ఆరబోసిన అందాలే కీలకం అనేది అందరు ఒప్పుకోవాల్సిన నిజం. ఆ సినిమాతో అమ్మడు సంపాదించిన స్టార్ డమ్, క్రేజ్ చూసి బడా స్టార్ హీరోయిన్లు సైతం విస్తుబోయారు. సినిమాల కంటే షాప్ ఓపెనింగ్స్ తోనే పాయల్ లైఫ్ సగం సెటిల్ అయిపోయింది. ఆ స్థాయిలో “ఆర్ ఎక్స్ 100” ఆమె కెరీర్ పై ప్రభావం చూపింది. అయితే.. ఆ సినిమా అనంతరం ఆమె ఐటెమ్ సాంగ్ చేసిన “సీత”, హీరోయిన్ గా నటించిన “ఆర్ డి ఎక్స్ లవ్” సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో.. ఆమె క్రేజ్ తగ్గకపోయినా మార్కెట్ వేల్యూ మాత్రం పడిపోయింది.

అందుకే ఈ శుక్రవారం విడుదలవుతున్న “వెంకీ మామ” సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది పాయల్. ఈ సినిమాలో అమ్మడు హిందీ టీచర్ గా నటిస్తోంది. వెంకీ-పాయల్ ల కెమిస్ట్రీ కంటే కామెడీ బాగా పండిందని సమాచారం. దాంతో ఈ సినిమా హిట్ అయితే పాయల్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం ఎన్నడూలేని విధంగా తనకు వీలైనంతలో భీభత్సంగా ప్రమోట్ చేస్తుంది పాయల్.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus