మొన్న రకుల్… ఇప్పుడు పాయల్..!

  • July 31, 2019 / 06:54 PM IST

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది పాయల్ రాజ్ పుత్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో.. హాట్ హాట్ లిప్ లాక్ లు.. అలాగే తన అందచందాలతో యూత్ ను నిద్ర లేకుండా చేసింది. తన మొదటి సినిమాలోనే అంత స్కోప్ ఉన్న పాత్ర చేయడం.. దాన్ని సద్వినియోగ పరుచుకుని మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తూనే.. మాస్ మహారాజ్ రవితేజ, విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా గడుపుతుంది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది పాయల్. తన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటోని షేర్ చేసింది పాయల్. ‘ఇంకా కబీర్ సింగ్ మోడ్ లోనే ఉన్నాను. నేను నటించే కొత్త సినిమాలో ఓ షాట్ కోసం ఇలా చేయాల్సి వచ్చింది. నోట్: ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ భామ. ఈ ఫొటోలో బాగా పాష్ గా కనిపిస్తూ.. రెండు సిగరెట్లను ఒకేసారి కాలుస్తుంది. నిజంగా లేడీ కబీర్ సింగ్ లానే కనిపిస్తుంది. అయితే ఏ సినిమాలో సీన్ కోసం ఇలా చేసిందనేది మాత్రం చెప్పలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus