‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రంలో ఈమె చేసిన గ్లామర్ షో కి యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాబట్టి నటిగా కూడా ఈమెకు ప్రశంసలు దక్కాయి. అయితే ఆ తరువాత నుండీ ఆమెకు అలాంటి పాత్రలే వస్తుండడంతో రిజెక్ట్ చేస్తూ వచ్చింది. మధ్యలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘సీత’ వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్ చేసింది. అయితే అవకాశాలు లేకపోవడంతో ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ వంటి బోల్డ్ చిత్రంలో నటించింది.
అయితే ఆ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. అయితే తాజాగా వచ్చిన ‘వెంకీ మామ’ చిత్రం ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో హిందీ టీచర్ గా నటించిన పాయల్ ఫ్యామిలీ ఆడియన్స్ ను కు కూడా దగ్గరయ్యింది. దీంతో ఇక నుండీ బోల్డ్ పాత్రలకి దూరంగా ఉండాలని భావిస్తోందట. మరి పాయల్ తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్ కు ఎంత వరకూ కలిసొస్తుందో చూడాలి. ప్రస్తుతం పాయల్.. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.