“ఆర్.ఎక్స్ 100” బ్లాక్ బస్టర్ హిట్ తోపాటు తిరుగులేని సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకొన్న కథానాయిక పాయల్ రాజ్ పుత్ కి ఆ సినిమా సాధించిన విజయం మంచి అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి అన్నీ ఐటెమ్ సాంగ్స్ లేదా సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయే కానీ.. తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్ ఒక్కటి కూడా రాలేదు. దాంతో అమ్మడు తమిళ సీమకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. నిన్నటినుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
అమ్మడు పాపం తెలుగులో వరుస సినిమాలు చేయాలనుకొంటున్నా.. ఇక్కడ ఆమెకి సరైన ఆఫర్లు రాకపోగా, ఆడిషన్ కి బదులు, బెడ్ రూమ్ కి రమ్మని పిలిచేవాళ్లు ఎక్కువయ్యారు. దాంతో ఏం చేయాలో తోచక తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది పాయల్. మరి అమ్మడి ఇంట్రెస్ట్ అర్ధం చేసుకొని ఇకనైనా.. దర్శకనిర్మాతలు ఆమెకు గ్లామర్ ను కాక ఆమె పెర్ఫార్మెన్స్ ను ఉపయోగించుకొనే రోల్స్ ఆమెకు ఆఫర్ చేస్తారేమో చూడాలి.