సినిమా అంటేనే వ్యాపారం….అవును నిజమే…ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అంటున్న సమయంలో, చిన్న హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చెయ్యని రోజులివి. అయితే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది…విషయం ఏమిటంటే….చిన్న సినిమాగా విడుదలయిన….పెళ్లి చూపులు సినిమా ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు.
ఓవర్ సీస్ లో, మల్టీ ప్లెక్స్ లలో ఈ సినిమా క్లాస్ పీపుల్ కి బాగా ఎక్కుతోంది. డబ్భై ఐదు లక్షల బడ్జెట్ ఖర్చు పెట్టారు నిర్మాతలు. సరాసరి 10 – 15 కోట్ల వరకూ పెట్టిన పెట్టుబడి రావచ్చు అని అంటున్నారు నిర్మాతలు. అదే క్రమంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా చిన్న సినిమాలకే సరికొత్త రికార్డ్ గా నిలవనుంది. ఇదిలా ఉంటే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం…..బాక్స్ ఆఫీస్ ఎలాగో షేక్ అవుతుంది….ఇప్పుడు అదే క్రమంలో మరొక సంచలనమైన రికార్డ్ సృష్టించింది ఈ సినిమా…అదేంటి అంటే….ఈ సినిమా టీవీ రైట్స్ ను….జెమినీ టీవీ వాళ్ళు రెండున్నర కోట్లకి కొన్నారు.
అంటే బడ్జెట్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అన్నమాట. దగ్గర దగ్గర మూడు ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ కోసం పోటీ పడిన తరవాత బిడ్డింగ్ లో ఈ రేటు కి జెమినీ కొన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా..చిన్న సినిమాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని ఈ సినిమా మరోసారి నిరూపించింది.