శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళిసందD’. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రం విడుదల అయ్యింది. కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు, ట్రైలర్ వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేసాయి. అయితే ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం పెద్దగా క్రియేట్ కాలేదు. దసరా బరిలో కనీసం ఈ సినిమా నాలుగు రోజులైనా నిలబడుతుందా అనే అనుమానం అందరిలోనూ కలిగింది.మొదటి రోజు సినిమాకి ప్లాప్ టాకే వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.రెండో వీకెండ్ ను కూడా ఈ చిత్రం భారీగా క్యాష్ చేసుకుంది.
10 రోజుల కలెక్షన్లను గమనిస్తే:
నైజాం | 1.88 cr |
సీడెడ్ | 1.38 cr |
ఉత్తరాంధ్ర | 0.92 cr |
ఈస్ట్ | 0.46 cr |
వెస్ట్ | 0.37 cr |
గుంటూరు | 0.58 cr |
కృష్ణా | 0.41 cr |
నెల్లూరు | 0.31 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.36 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 6.68 cr |
‘పెళ్ళిసందD’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5.2 కోట్లు. మొదటివారానికే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.6.68 కోట్లను కలెక్ట్ చేసి బయ్యర్లకు 1.48 కోట్ల లాభాలను అందించింది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?