యాక్షన్ మాస్టర్ సెంటిమెంట్ సినిమా!

  • December 5, 2017 / 10:26 AM IST

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ పేరు తెలియనివారుండరు. ప్రస్తుతం ఒక సినిమాలోని 24 క్రాఫ్ట్స్ లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఫైట్స్ ను కంపోజ్ చేయడమే కాక.. ఒక భారీ బడ్జెట్ సినిమా అనగానే అందులో పీటర్ హెయిన్స్ లేకపోతే “ఇది నిజంగా భారీ బడ్జెట్ సినిమానేనా?” అని ప్రేక్షకులు సైతం డౌట్ పడే స్థాయిలో పేరు సంపాదించుకొన్న పీటర్ మాస్టర్ త్వరలోనే దర్శకుడిగా ప్రేక్షకులను పలకరించనున్నాడని సమాచారం. అయితే.. పీటర్ మాస్టర్ సినిమా అనగానే ఏదో మాంచి యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ తీస్తున్నాడనుకొంటే పొరబడినట్లే.

ఇప్పటివరకూ పొలోమని యాక్షన్ సినిమాలకు వర్క్ చేసి చేసి బోర్ కొట్టిందో లేక కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దామనుకొన్నాడో ఏమో కానీ.. ఒక సెంటిమెంట్ సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యాడట. తల్లీకూతుర్ల బాంధవ్యం నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నిన్న ఇండీవుడ్ ఫెస్టివల్ లో ఎనౌన్స్ చేశాడు. అలాగే.. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నానని, త్వరలోనే నటీనటులు ఎవరనేది తెలియజేస్తానని చెప్పాడు పీటర్ మాస్టర్. ఇటీవలే ఫైట్ మాస్టర్ గా నేషనల్ అవార్డ్ సైతం అందుకొన్న పీటర్ మాస్టర్ డైరెక్టర్ గా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన ఫైట్స్ లో ఇరగదీసిన స్టార్ హీరోలు మెరుస్తారని వినికిడి. అలాగే.. ప్రమోషన్స్ విషయంలోనూ స్టార్ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus