మంచి కలెక్షన్లు రాబడుతున్న ‘పేట’,’విశ్వాసం’ .. చిత్రాలు!

  • January 12, 2019 / 04:01 AM IST

టాలీవుడ్ లో.. మాదిరిగా కోలీవుడ్ లో కూడా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ తో పాటు ‘తలా’ అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. ఈ రెండు చిత్రాలూ కూడా మొదటి షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

రజనీ తో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘పేట’ చిత్రం రజినీ ఫ్యాన్స్ ను విపరీతంగా అలరిస్తుంది. ఈ చిత్రంలో వింటేజ్ రజినీని చేశామంటూ.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్లో …. రజినీ స్టైలిష్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా.. సెకండ్ హాఫ్ కాస్త మైనస్ అయ్యింది. ఇక ఈ చిత్రం మొదటి రోజు చెన్నై సిటీ లో 1.12 కోట్ల గ్రాస్ ను నమోదుచేసింది. ఇక మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘విశ్వాసం’ చిత్రంలో కూడా అజిత్ నయనతార, నటన ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచింది. ఇక క్లైమాక్స్, జగపతి బాబు విలన్ రోల్ సినిమాలో కాస్త మైనస్ అయ్యాయనే చెప్పాలి. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు చెన్నై సిటీలో 88లక్షల గ్రాస్ ను నమోదుచేసింది. పొంగల్ హాలిడేస్ ఉండడంతో.. ఈ రెండు చిత్రాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ‘పేట’ చిత్రం తెలుగులో విడుదలై మంచి స్పందన రాబట్టింది. ఇక అజిత్ ‘విశ్వాసం’ త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus