పంబ రేపుతున్న పెట్ట టీజర్, వింటేజ్ రజనీ ఈజ్ బ్యాక్
- December 12, 2018 / 06:20 AM ISTByFilmy Focus
ఒక రజనీకాంత్ అభిమాని కోరుకునేది ఏముంటుంది.. రజనీ స్టైల్, ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, మంచి యాక్షన్ ఎపిసోడ్స్. వీటన్నిటినీ సరైన గాడిలో పెట్టే కథ, ఆ కథను సమర్ధవంతంగా నడిపించిగల సత్తా ఉన్న దర్శకుడు. ఇవి కదా రజనీ అభిమానులు కోరుకునేది. ‘కబాలి’లో స్టైల్ కనబడింది, ‘కాలా’లో రజనీ మార్క్ కనబడింది, ‘2.0’లో అన్నీ ఉన్నా బలమైన కథ మిస్ అయ్యింది.

దాంతో చాలా కాలంగా రజనీ అభిమానులకు ఆయన సినిమాలో ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. అందువల్ల వాళ్ళు రజనీ సినిమాలతో పూర్తిస్థాయిలో సాటిస్ఫై కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని కరెక్ట్ గా పసికట్టాడు యంగ్ & టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.

రజనీ ద్విపాత్రాభినయం పోషిస్తున్న ‘పెట్ట’ టీజర్ ఇవాళ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. రజనీ మార్క్ మాస్ & స్టైల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ టీజర్ రజనీ అభిమానులకు నిజమైన పండగ. ముఖ్యంగా.. ఆ వాకింగ్ స్టైల్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్న రజనీకాంత్ ఈ టీజర్ లో ప్రత్యేక ఆకర్షణలు. జనవరిలో విడుదలవుతున్న ఈ చిత్రంపై రజనీ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.

















