PAPA Teaser: అవసరాల శ్రీనివాస్ మార్క్ రొమాంటిక్ టీజర్..!

గతేడాది ‘కార్తికేయ2’ ‘ధమాకా’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నుండి రాబోతున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. యంగ్ హీరో నాగశౌర్య, ప్రామిసింగ్ మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరిస్తున్నారు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక నాగ శౌర్య – మాళవిక నాయర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం కూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది. దీంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం పై మల్టీప్లెక్స్ ఆడియన్స్ దృష్టి పడింది. అందుకు తగ్గట్టే టీజర్ కూడా ఉంది. ఒక నిమిషం 6 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో రొమాంటిక్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి.

అవసరాల ఇలాంటి సినిమాలకు స్పెషలిస్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మాళవిక ఎన్నడూ లేని విధంగా లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొన్నట్లు టీజర్ చెబుతుంది. శౌర్య – మాళవిక ల కెమిస్ట్రీ … అందుకు తగ్గట్టు కళ్యాణి మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీలింగ్ ను కలిగిస్తాయి. అచ్చ తెలుగు అవకాయ లాంటి డైలాగులు అవసరాల సినిమాల్లో ఉంటాయి.

మరి అతని నుండీ 7 ఏళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి. టీజర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి:


రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus