Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

  • December 7, 2023 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

పిండం ట్రైలర్ గురువారం ఉదయం 11:45 గంటలకు విడుదలైంది. 3 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈశ్వరీ రావుతో “మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?” అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎవరూ నివసించని ఒక ఇంటిలోకి కథానాయకుడు శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు “మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు” అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది. ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా “ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం.” అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. ట్రైలర్ లో కెమెరా పనితనం కానీ, నేపథ్య సంగీతం కానీ హారర్ చిత్రానికి తగ్గట్టుగా అద్భుతంగా కుదిరాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే థియేటర్ లో ప్రేక్షకులు అసలైన హారర్ అనుభూతిని పొందడం ఖాయమనిపిస్తోంది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Avasarala Srinivas
  • #pindam
  • #pindam trailer

Also Read

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

related news

trending news

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

2 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

18 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

19 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago

latest news

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

2 days ago
Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version