Krithi Shetty: ‘ఉప్పెన’ బ్యూటీకి సర్జెరీ నిజమేనా?

Advertisement

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఎక్కువే.పెద్ద సినిమాలకు రష్మిక, పూజా హెగ్డే లు తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. కీర్తి సురేష్ ను అన్ని వర్గాల ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. ‘సర్కారు వారి పాట’ వంటి కమర్షియల్ హిట్ పడినా ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.ఇలాంటి టైంలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రాకెట్ లా దూసుకొచ్చింది. ‘ఉప్పెన’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూలు కడుతున్నాయి.

ఇటీవల ఈమె నటించిన ‘ది వారియర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి అంటే అందుకు కృతి శెట్టి క్రేజ్ కూడా ఓ కారణమని చెప్పాలి. ఈమె నితిన్ కు జోడీగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రం కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉండగా.. కృతిశెట్టి సర్జెరీ చేయించుకోబోతుంది అంటూ ఇప్పుడు ప్రచారం మొదలైంది. అది నిజమా? కాదా? అని ఆరా తీయగా..

ఆమెకు ఆ ఆలోచన అయితే ఉంది కానీ ఎప్పుడు చేయించుకుంటుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అన్నట్టు జవాబు వినిపించింది. సోషల్ మీడియాలో కృతి శెట్టి మూతి గురించి కొంతమేర ట్రోలింగ్ జరుగుతుంది. ఆమె పెదాలు కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి అనే విమర్శ ఉంది.అందుకోసమే ఆమె తన మూతికి సర్జెరీ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

విదేశాల్లో ఆమె సర్జెరీ చేయించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా స్పష్టమవుతుంది. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి హీరోయిన్లు బయటకు చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఆమె ఈ విషయం పై క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే లేవనే చెప్పాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news