మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ ఈనెల 27 న రిలీజ్ కానుంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తో మహేష్ కోలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ సినిమా బలం, బలహీనతల గురించి మాట్లాడుకుంటే..
బలాలు
సూపర్ స్టార్స్స్పైడర్ కు మహేష్ బాబు, డైరక్టర్ మురుగదాస్ ఇద్దరూ ప్రధాన బలం. డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంటుందనే నమ్మకం ఉంది.
హీరోయిన్నేటి క్రేజీ హీరోయిన్స్ లో రకుల్ ఒకరు. ఆమెకు లక్కీ హ్యాండ్ అనే పేరు ఉంది. సో రకుల్ అందం, అదృష్టం స్పైడర్ కి కలిసి రానుంది.
భారీతనంసినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ సీన్లకు గ్రాఫిక్స్, విజువల్ ఎఫక్ట్స్ కనువిందు చేయనున్నాయి.
బలహీనతలు
సబెక్టుటెర్రరిజం, అది దృష్టించే భయాందోళనలు, దానిపై పరిశోధన. .. ఇలా సాగె కథ మహిళా ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిస్తాయా ? అనే సందేహం ఉంది. పైగా మహేష్ ఫ్యాన్స్ లో మహిళలే అధికం. సో వారు తగ్గే అవకాశం ఉంది.
ఆడియోహరీష్ జయరాజ్ ఇచ్చిన ఆల్బం లో హాలీ హాలీ పాట మినహా మిగతావేవీ మాస్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అది సినిమాకి ప్రధాన మైనస్.
తమిళ వాసనటీజర్, ట్రైలర్ గమనిస్తే ఎక్కువగా తమిళ నటులతో సినిమా నిండినట్లుగా అనిపిస్తోంది. సో కోలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోతారు.
మురుగదాస్ ఇలాంటి డ్రై కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మరి స్పైడర్ విషయంలో ఈ మైనస్ లను ఎలా అధిగమించారో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.