మెగాస్టార్ చిరు, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ కలసి ‘ప్రజా రాజ్యం’ అనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ మరిచిపోలేము. అయితే రాజకీయం అంటే రకరకాల ఇబ్బందులు, ఉంటాయి అని ఆలస్యంగా గమనించిన ఈ మెగా బ్రదర్స్, ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉంటే పవన్ ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, చిరు కొంగ్రెస్ లో ఉన్నారు.
అయితే పవన్ పార్టీ స్థాపించిన సమయం నుంచి చిరు కి పవన్ కి మధ్య మనస్పద్ధలు వచ్చాయి అని మీడియాలో ప్రచారం జరిగింది. ఇక దానికి అక్కడక్కడా చిరు క్లారిటీ కూడా ఇస్తూ…పాలిటిక్స్ లో రెండు వేర్వేరు దారుల్లో ఉండొచ్చు…కాని మేం ఎప్పటికే బ్రదర్స్ అని చెప్పాడు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకూ మౌనంగా ఉన్న పవన్ నిన్న జరిగిన సర్దార్ ఆడియోలో ఓపెన్ అయిపోయాడు. పవన్ మాట్లాడుతూ…అన్నయ్యపై తనకు ఉన్న అభిమానాన్ని, అన్నయ్యతో తనకున్న అనుభందాన్ని మరోసారి చూపించాడు…అన్నయ్యకు పాలిటిక్స్ పరంగా ఆయనకు నచ్చని పని కూడా చేశాను. ఏ పరిస్థితుల్లో చేసానో, ఎలాంటి పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చిందో, ఎందుకు చేశాను అనేది ఆయనకు వివరించడంతో అన్నయ్య నన్ను అర్ధం చేసుకున్నారు.
ఇక వేరు వేరు పార్టీల విషయం గురించి మాట్లాడుకుంటే…మా బంధం వేరు, రాజకీయాలు వేరు. అవి రెండు దార్లు. ఏ దారిలో ఉన్నా అన్నయ్య స్థాయి తగ్గదు. ఆయన దారిలో నడవకపోయినా తాను ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. ఈ విషయాన్ని పదే పదే ఇది నేను ప్రూవ్ చేసుకోవక్కర్లేదు. అవసరం వచ్చినప్పుడు ఆయన కోసం నేను నిలబడతాను. ఇది నేను చెప్పక్కర్లేదు. అంటూ పవన్ చిరుపై, తన పొలిటికల్ కరియర్ పై క్లారిటీ ఇచ్చాడు.