ఇంతకుమునుపు హీరోయిన్ల అందాలను ఆస్వాదించాలంటే థియేటర్లు మాత్రమే దిక్కు. ఆ తర్వాత పోస్టర్లు మీద బొమ్మలు చూసి సంతృప్తిపడేవారు జనాలు. ఈ డిజిటల్ యుగం మొదలయ్యాక ట్రైలర్, ప్రోమోస్, టీజర్స్ అంటూ ఆన్ లైన్ లో అందాల భామల సొగసులు చూసి సంతుష్టులవుతున్నారు అభిమానులు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోయిన్లు సినిమాల్లో కంటే మ్యాగజైన్ ఫోటోషూట్స్ లోనే హాట్ గా దర్శనమిస్తున్నారు. అప్పట్లో శ్రుతిహాసన్ చేసిన “మాగ్జిమ్ షూట్” మత్తులోను నుంచి బయటపడడానికి కుర్రాళ్ళకి రెండు నెలలు పట్టింది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ కూడా మాగ్జిమ్ ఫోటోషూట్ కోసం దిగిన ఫోటోలు రచ్చ రచ్చ చేశాయి.
ఇప్పుడు ఆ ఇద్దరు భామ తరహాలో “దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత” ఫేమ్ పూజా హెగ్డే కూడా “ఫెమినా” అనే మ్యాగజైన్ కవర్ కోసం ఒక స్పెషల్ & హాట్ ఫోటోషూట్ చేయించుకొంది. సదరు ఫోటోషూట్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ కవర్ పేజ్ పై పూజ అందాల ప్రదర్శన మామూలుగా లేదు. మాములుగానే పూజా హెగ్డే అందాలు కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా ఉంటాయి అలాంటిది అంగాంగ ప్రదర్శన చేస్తున్న పూజను చూస్తే ఈ మండు వేసవిలోను యువ హృదయాలు వేడికి కరిగిపోవాల్సిందే.