త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా పూజ ఫైనల్

  • April 8, 2019 / 03:57 PM IST

ప్రస్తుతం ఒక క్రేజీ హిట్ కోసం పరితపిస్తున్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. మరీ భారీ డిజాస్టర్లు కొట్టకపోయినా.. సరైన హిట్ అందుకొని మాత్రం చాలా ఏళ్లయ్యింది. ముఖ్యంగా.. “నా పేరు సూర్య” ఫ్లాప్ అవ్వడం అల్లు అర్జున్ కి చాలా పెద్ద దెబ్బ. ఆ సినిమా కోసం కష్టపడినట్లుగా అల్లు అర్జున్ మరో సినిమాకి కష్టపడలేదు. అందుకే.. తనకు రెండు మోడరేట్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సైన్ చేయడమే కాక.. తన బాడీ లాంగ్వేజ్ & స్టైల్ విషయంలో కూడా కొత్తగా ప్రయత్నించేందుకు సన్నద్ధమవుతున్నాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు టెక్నీషియన్స్ అందరూ రెడీగా ఉన్న ఈ ప్రొజెక్ట్ కి ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఫైనల్ అవ్వలేదు.

తొలుత కైరా అద్వానీ, అనంతరం రష్మిక మండన్నా పేర్లు వినిపించినప్పటికీ.. అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాధం” చిత్రంలో సరసాలాడిన పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ ఆల్రెడీ పూజతో “అరవింద సమేత” చిత్రం కోసం పనిచేసి ఉండడంతో ఆయన కూడా ఆమెనే ప్రిఫర్ చేశాడట. ఆ విధంగా పూజ మళ్ళీ బన్నీతో రొమాన్స్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈమేరకు ఇప్పుడే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus