Pooja Hegde: గుంటూరు కారంలో పూజా మిస్సైన రోల్ లుక్ వైరల్.. లుక్ బాగుందంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం వరకు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు పూజా హెగ్డేకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. గుంటూరు కారం సినిమాలో మొదట మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక కాగా సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ఎంపికయ్యారు. అయితే కథ విషయంలో చేసిన మార్పులు, డేట్స్ సమస్య, ఇతర కారణాల వల్ల పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

అయితే అప్పటికే షూట్ చేసిన ఫుటేజ్ నుంచి కొన్ని అన్ సీన్ స్టిల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఫోటోలలో పూజా హెగ్డే బుట్టబొమ్మలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కాంబోలో సీన్స్ షూట్ చేశారని ఈ ఫోటోల ద్వారా అర్థమవుతోంది. పూజా హెగ్డే తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజా హెగ్డే నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.

అయితే సరైన పాత్రతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు వస్తే ఆమె కెరీర్ పరంగా బిజీ అవుతారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇతర భాషల్లో ప్రస్తుతం పూజా హెగ్డేకు పరిమితంగా ఆఫర్లు వస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే పూజా హెగ్డే రెమ్యునరేషన్ సైతం తగ్గిందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తుండగా పూజా హెగ్డే సరైన ప్రాజెక్ట్ తో రీఎంట్రీ ఇస్తే మాత్రం తిరుగుండదని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ తర్వాత సినిమాలలో పూజా హెగ్డేకు ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి. రోల్స్ ఎంపికలో (Pooja Hegde) పూజా హెగ్డే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus