‘ప్రభాస్ 20’ పూజా హెగ్దే రోల్ అలా ఉండబోతుందట…!

‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ తన 20 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక లాక్ డౌన్ ముగిశాక బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం ఫినిష్ చేయనున్నారు. విదేశాలకు వెళ్ళకుండా … ఇక్కడే సెట్స్ వేసి షూటింగ్ కంటిన్యూ చేస్తారని తెలుస్తుంది.

అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడికల్ నేపధ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే పాత్ర ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఈ చిత్రంలో పూజా పంతులమ్మ పాత్రలో కనిపిస్తుంది అని సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. కానీ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం… ఈ చిత్రం పూజా మ్యాజిక్ టీచర్ గా కనిపించబోతుందట.

Pooja Hegde's role in Prabhas 20 movie1

అప్పటి కాలం నాటి డ్రెస్సింగ్ ధరించి … సరికొత్త లుక్ లో కనిపిస్తుంది అని సమాచారం. ఈ చిత్రంలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని కూడా తెలుస్తుంది. ఎలాగూ ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా విడుదల కాబోతుంది కాబట్టి.. అక్కడ కూడా ఈమెకు కలిసొస్తుంది అని పూజా భావిస్తుందట. ఎలాగూ పూజా కూడా బాలీవుడ్ లో రాణించాలి అనుకుంటుంది కాబట్టి.. అలా ప్లస్ కానుంది అన్న మాట.

Most Recommended Video


అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus