అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 2, 2020 / 12:28 PM IST

సున్నితమైన ప్రేమకథలు అద్భుతమైన విజయాలు అందుకున్న సందర్భాలు అనేకం. అలాంటి స్వచ్ఛమైన, ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అమృతారామమ్. రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు సురేంధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదాపడుతూ వస్తుంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో అమృతారామన్ సినిమాను డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి వచ్చింది. జి 5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుండగా అలా విడుదలైన మొదటి చిత్రం అమృతారామమ్. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథ: రామ్‌ (రామ్‌ మిట్టకంటి) ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ పూర్తి చేసి, తన చదువుకు సరిపడా ఉద్యోగం వెతికే పనిలో ఉంటాడు. అదే సమయంలో అమృత (అమిత రంగనాథ్‌) మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వస్తుంది. తొలిచూపులోనే రామ్ తో ప్రేమలో పడిపోతుంది అమృత. అతన్ని అమితంగా ఆరాధించే అమృత ప్రేమను రామ్ అంగీకరిస్తాడు. వీరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో కొన్ని సంఘటనలు, నిర్ణయాలు వీరి మధ్య దూరం పెంచుతాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని రామ్, అమృత ఎందుకు దూరం అయ్యారు? అసలు మళ్ళీ వాళ్లు కలిశారా.. లేదా? వీరిద్దరి ప్రేమ కథ చివరికి ఎలా ముగిసింది? అనేది మిగతా కథ..

నటీనటుల పనితీరు: అమృత పాత్ర చేసిన అమిత రంగనాథ్ నటన పరంగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఓ అబ్బాయిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయిగా తను సహజ నటన కనబరిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో తన నటన ప్రేక్షుకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

ఇక హీరో రామ్ కూడా ఫ్రస్ట్రేటెడ్ లవర్ పాత్రలో పర్వాలేదనిపించారు. ఐతే ఆయన నటనలో అంత మెచ్యూరిటీ కనబడలేదు. కొంచెం మెరుగవ్వాలన్న భావన కలిగింది. ప్రధాన పాత్రలు చేసిన అమిత, రామ్ మినహా సినిమాలో ఎవరి పాత్రలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్ కావు. సినిమా చాలా వరకు దర్శకుడు వీరిపై నడిపించేశాడు.

సాంకేతిక వర్గం పనితీరు: అమృతారామమ్ మూవీలో మ్యూజిక్ చాల బాగుంది.సాంగ్స్ తో పాటు సన్నివేశాలకు తగ్గట్టుగా సాగే బీజీఎమ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమా నేపథ్యం మొత్తం దాదాపు ఆస్ట్రేలియాలో సాగుతుంది. కెమెరా వర్క్ పరవాలేదు. ఎడిటింగ్ ఆకట్టుకోదు. డైలాగ్స్ బాగున్నాయి.

దర్శకుడు ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని రొటీన్ సన్నివేశాలతో తెరకెక్కించి నిరాశపరిచాడు.

విశ్లేషణ: అమృతరామమ్ కొత్తదనం లేని ఓల్డ్ ఎమోషనల్ లవ్ డ్రామా అని చెప్పవచ్చు. లవ్ యట్ ఫస్ట్ సైట్ కి లోనైన అమ్మాయి రామ్ ని ప్రాణం కంటే ఎక్కవగా ప్రేమిస్తుంది. అమృత రామ్ ని అంతగా ఇష్టపడడానికి అక్కడ బలమైన కారణం ఉండదు. అలాగే వీరి మధ్య ప్రేమ మొదలయ్యే సన్నివేశాలలో కూడా అంత ఫీల్ లేకపోవడం ఒక మైనస్. ఇక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు ఎలా లేవో వారు విడిపోవడానికి కూడా చెప్పుకో దగ్గర కారణాలు ఏమి కనిపించవు. దీనితో ఒకరంటే ఒకరికి ప్రాణమైన ప్రేమికుల మధ్య వచ్చే సిల్లీ గొడవలు, విడిపోవడాలు ప్రేక్షకులకు అనుభూతిని పంచవు. కేవలం ఆ రెండు పాత్రల పైనే శ్రద్ద పెట్టి సినిమా మొత్తం వారిపై నడిపించేశారు. దీనితో చాల సన్నివేశాలు రొటీన్ గా మరియి పదేపదే చూస్తున్న భావన కలుగుతుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు కొంచెం ఆహ్లాదం కలిగించే అంశాలు.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus