“దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి” లాంటి సూపర్ హిట్ చిత్రాలు తన లిస్ట్ లోకి వచ్చి చేరడంతో పూజా హెగ్డే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో అల్లు అర్జున్, ప్రభాస్ చిత్రాలున్నాయి. ఈ రెండు కాకుండా తెలుగులో తన పరిచయ చిత్ర కథానాయకుడైన వరుణ్ తేజ్ తో పూజా మరోసారి నటించనుందనే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం పూజ హెగ్డే ఏకంగా 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగిందని వార్తలొచ్చాయి కూడా. అయితే.. వెంటనే స్పందించిన హరీష్ శంకర్ అవన్నీ రూమర్స్ అని కొట్టిపాడేశాడనుకోండి.
అయితే.. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు పూజ హెగ్డేను క్యాస్ట్ చేసుకొందామనుకొన్నప్పటికీ.. ఆమె రెమ్యూనరేషన్ విషయంలో తగ్గుముఖం చూపకపోవడంతోపాటు షూటింగ్ డేట్స్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో “వాల్మీకి” సినిమా నుంచి ఆమెను తప్పించారని టాక్. మరి ఆమె స్థానంలో ఎవర్ని తీసుకొంటున్నారు అనేది క్లారిటీ లేదు కానీ.. జనాలు మాత్రం వరుణ్ హైట్ కి పూజా అయితేనే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.